చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం.. కేజ్రివాల్‌

YouTube video

న్యూఢిల్లీ: చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. ‌ దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కేసులు ఉద్ధతమవుతున్న నేపథ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. అత్యంత ధైర్యవంతులైన మా 20 మంది సైనికులు వెనక్కి తగ్గలేదు.. మేము కూడా వెనక్కి తగ్గేది లేదు.. ఈ రెండు యుద్ధాలపై విజయం సాధిస్తామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరోనా పరీక్షల సంఖ్యను తాము గతం కంటే మూడు రెట్లు అధికంగా పెంచామని కేజ్రివాల్‌ అన్నారు. గతంలో రోజుకు 5000 టెస్టులు చేసేవాళ్లమని, ప్రస్తుతం రోజుకు 18000 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, లక్షణాలు కనబడిన వెంటనే ప్రభుత్వ కరోనా టెస్టింగ్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రస్తుతం 56,746 పాజిటివ్‌ కేసులుండగా 31294 మంది డిశ్జార్జి అయ్యారు. 2112 మంది మరణించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/