విశాఖ‌లో ప్ర‌ధాని స‌భ సక్సెస్ – జగన్‌కు హ్యాట్సాఫ్‌

శనివారం విశాఖ జరిగిన మోడీ సభ భారీ సక్సెస్ అయ్యిందని వైస్సార్సీపీ మంత్రి బొత్స అన్నారు. ప్రధాని సభలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌ తెలిపారు. కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యంగా మారాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, ప్రభుత్వంపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. వారి ఆలోచన ఎలా ఉన్నా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

విశాఖలో ప్రధాని సభ సక్సెస్ అయ్యిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ విధానాన్ని సీఎం జగన్ ప్రధానికి స్పష్టంగా చెప్పారు. విశాఖ సభ ద్వారా జగన్‌ మంచి మెసేజ్‌ ఇచ్చారని మంత్రి తెలిపారు. శనివారం విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎంవీఎస్‌ సత్యనారాయణతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం మా విజయనగరంకు జనసేన నాయకుడు పవన్‌ వెళ్తారట. జగనన్న కాలనీలు చూసేందుకు వెళ్తారట. వెళ్లండి తప్పులేదు. విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద లే అవుట్‌ ఎక్కడా లేదు. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 10 వేల మందికి పక్కా ఇళ్లు ఇచ్చాం. అది ఒక టౌన్‌షిప్‌.అక్కడ ఊరు నిర్మిస్తున్నాం. అది పూర్తి కావడానికి నాలుగేళ్లు అవుతుందన్నారు.