సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో భారీ అగ్ని ప్ర‌మాదం..

సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో భారీ అగ్ని ప్ర‌మాదం..

సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పటల్ లోని ఐసోలేషన్‌ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, హాస్పిటల్‌ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఐసోలేషన్‌ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ అగ్నికి ఆహుతయ్యాయి.

ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అలార్ట్ కావ‌డం తో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. పోలీసుల‌కు, ఫైర్ సిబ్బంది సమాచారం అందుకొని సకాలంలో స్పందించి మాటలను అదుపు చేసారు. ఐసోలేష‌న్ విభాగం లో షాట్ స‌ర్క్యూట్ అవ‌డం తోనే ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌న వేస్తున్నారు. కానీ ఆస్థి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెపుతున్నారు.