కరోనాపై విజయం సాధించి తీరాలి

‘మన్ కీ బాత్’ లో మాట్లాడిన మోడీ

కరోనాపై విజయం సాధించి తీరాలి
Mann ki Baa- PM Modi

New Delhi: కరోనాను ఓడించాలంటే ప్రజా సంయమనానికి మించిన ఆయుధం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రజా సహకారం అత్యంత కీలకమన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రజలంతా లాక్ డౌన్ ను తప్పని సరిగా పాటించాలన్నారు. కరోనాపై పోరులో మనం గెలిచి తీరాలన్నారు.

ప్రజలను, దేశాన్ని కాపాడుకోవాలంటే కరోనాపై విజయం సాధించి తీరాలనీ, అందుకోసం ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మోడీ విజ్ణప్తి చేశారు.

ప్రజల రక్షణ కోసమే దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినట్లు చెప్పిన ఆయన జనం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా హాని చేసిన వారవుతారని పేర్కొన్నారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/