గాజు, ఉంగరం మ్యాచింగ్‌

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌…

fashion fashion- Bangle- ring matching
fashion fashion- Bangle- ring matching

మనం వేసుకునే డ్రెస్‌లూ కట్టే చీరలకు తగినట్లు రకరకాల గాజులు కొనుక్కుంటాం. బంగారు గాజులైతే స్తోమతను బట్టి ఒకటి లేదా రెండు జతలు ఉండేలా చూసుకుంటాం.

ఆ తర్వాత చెవులకు పెట్టుకునే కమ్మలు ఉంగరాల గురించి ఆలోచిస్తాం. వీటన్నింటితోనే రకరకాల మ్యాచింగ్‌లు చేసుకుంటాం.

ఇకపైన మీ మ్యాచింగ్‌ స్టైల్‌ని మార్చమంటున్నారు డిజైనర్లు. ఎందుకంటారా మనం వేసుకునే గాజు డిజైనులోనే ఉంగరం ఉండటమే ఇప్పుడు ఫ్యాషన్‌ మరి.

గాజులో రాళ్లు పొదిగినా, నాలుగైదు వరుసలో చుట్టు ఉట్టినటుల ఉన్నా దానికి జోడిగా ఉంగరమూ తయారై ఫ్యాషన్‌ ప్రేమికులను మెప్పిస్తోంది.

ఈ జోడి సంప్రదాయ దుస్తులకు చక్కని ఎంపిక కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే నగలకు జతగా వీటిని పెట్టుకుంటే ఆహార్యానికి నిండుదనం వస్తుంది.

పట్టీల చెప్పులు

సందర్భం, మనం వేసుకునే దుస్తుల్ని బట్టి చెప్పుల్ని మారుస్తాం కానీ కాళ్లకు ఉన్న పట్టీలను కాఉద. కానీ చెప్పులకు తగినట్లుగా పట్టీలు ఉంటే బాగుంటుంది కదా ఆ ఆలోచనలతోనే చెప్పులతోపాటు పట్టీలనూ రకరకాలుగా డిజైన్‌ చేస్తూన్నారు.

ఎలాగంటారా వీటిలో చెప్పుల ముందుభాగం అంతా సాదాగా ఉండి వాటి స్ట్రాప్స్‌పైన మాత్రం ముత్యాలు లేదా కొన్ని గొలుసుల్లా ఉంటాయి. ఇవి వేసుకుంటే పట్టీలు పెట్టుకున్నట్లే ఉంటుంది.

నలుపు, నీలం మాత్రమే కాదు పలు లేత రంగుల్లో సందడి చేస్తోన్న ఈ చెప్పుల్ని సంప్రదాయ దుస్తులే కాదు, జీన్స్‌, స్కర్టు లాంటి వాటిమీదకూ వేసుకోవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/