ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

రాజకీయ కక్షలకు పేదలు బలి:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

గత ప్రభుత్వంలో నిర్మించిన పది లక్షల ఇళ్లు ఆధునిక వసతు లతో నిర్మించి పూర్తయి గృహప్రవేశం చేసుకునే సమయంలో ప్రభుత్వం మారినందున పదహారు నెలలు గడిచినా సదరు ప్లాట్లు లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో బూజులు, చెదలు పట్టి రంగులు వెలసిపోయి నిర్వీర్యంగా మారాయి.

కొంత మంది ఒక్కోప్లాట్‌కు ముందస్తుగాలక్షల రూపాయలు చెల్లించా రు. గృహలు లబ్ధిదారులకు అందిస్తే గత ప్రభుత్వానికి మంచి పేరువస్తుందనే అప్పగించడం లేదనేఅపవాదూ ఉంది.

ప్రస్తుత ప్రభుత్వం కూడా ముప్ఫైలక్షల ఇళ్ల స్థలాలు ఇస్తానని మూడు సార్లు వాయిదాలు వేస్తూ వచ్చింది.

అవిఎప్పుడు ఇస్తారో తెలి యదు.ప్రభుత్వం మారినట్లయితే ఈఇళ్లస్థలాలు కూడా అలాగే అటకెక్కిస్తే పేదలకు సొంత ఇంటికల ఎప్పటికి నెరవేరు తుంది. రాజకీయ కక్షలకు ఇళ్లు లేని పేదలను బలి చేయవద్దు.

నిధులు కేటాయించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

నూతన మున్సిపాలిటీలకు అధిక నిధులు కేటాయిస్తే మున్సి పాలిటీలలో మౌలిక వసతుల రూపకల్పన జరుగుతుంది. చాలా మున్సిపాలిటీలలో సిసి రోడ్ల నిర్మానం జరగడం లేదు.

మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి సుమారు ఆరు నెలలు అవుతుంది. కావ్ఞన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

మున్సిపాలిటీలలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాల్సిన అవస రం కూడా ఉంది. చాలా గ్రామపంచాయతీలు మున్సిపాలిటీ లుగా మారడం జరిగింది. మున్సిపాలిటీలు అయినందుకు అభివృద్ధి కూడా జరిగితే చాలా బాగుంటుంది.

ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును పెంచవద్దు: -సి.ప్రతాప్‌,శ్రీకుళం

ఎగువ రాష్ట్రమైన కర్ణాటక కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును పెంచేందుకు తగిన అనుమతుల కోసం కేంద్ర పర్యావ రణ సంఘాన్ని ఆశ్రయించడం అహేతుకం. ఈ నిర్మాణానికి మహారాష్ట్రతోపాటు కేంద్రప్రభుత్వంకూడా సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ నిర్మాణం వలన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లురాక బీడు భూములుగా మారడం తథ్యం. కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండు తెలుగురాష్ట్రాలకు కేటాయించిన మిగులు జలాలు డిసెంబరు వరకు లభ్యంకాకపోవడంతో తాగునీటి కొరత ఏర్పడుతుంది.

కొత్త ప్రణాళికలు రూపొందించాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పుతోపాటు వెయ్యి రూపాయల నగదును కూడా పేదలకు అందించింది.

అయితే తీవ్ర అనారో గ్యంతో బాధపడే నిరుపేద కుటుంబాలకు కనీసం మందులు కూడా కొనుకున్కేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేక, ప్రభు త్వం ఇచ్చిన చేయూత ఎందుకూ సరిపోక అల్లాడిపోతున్నారు.

రోజంతా కూలిపని చేసి నెలకు ఎనిమిదివేలు సంపాదిస్తున్నా ప్రభుత్వ వైద్యం పడకేసినందున మందులకు, తిండికి ఖర్చులు సరిపోకదినదినగండంగా బతుకుతున్నారు. గ్రామాలలో ఉపాధి మామీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

తెల్లకార్డుదారులకు 60ఏళ్లకు పైబడిన వారికి నెలకు2,500 పింఛను లభిస్తుండగా రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం మందికి కార్డులు లేక ప్రభుత్వ సాయం అందడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అనారోగ్య నిరుపేదల కోసం ప్రత్యేక చేయూతను అందించే దిశగా కొత్త ప్రణాళికలను అమలు చేయాలి.

ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

కరోనా నేపథ్యంలో ప్లాస్మాథెరపీ ఒక కీలకమైన అంశంగా మారింది. దేశరాజధాని ఢిల్లీలో 60 మంది రోగులకు ప్లాస్మా థెరపిఅందించడం వలన ప్రాణాపాయ పరిస్థితుల నుండి కోలు కున్న వార్త వైద్యవర్గాల్లో ఆశావాహంగా మారింది.

ఢిల్లీ ప్రభు త్వం అత్యవసరంగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసి ప్లాస్మా దానం చేసే వారికి బహుప్రోత్సాహకాలను సైతం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్లాస్మా బ్యాంకులు తక్షణం నెలకొల్పాలి.

కరోనాబారి నుండి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేస్తే మరి కొందరికి ప్రాణదానం చేసిన వారవుతారు.

ధరలను తగ్గించాలి:. -కె.రామారావు, హైదరాబాద్‌

దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వాల ప్రకట నలు నీటి మీద రాతలుగా తేలిపోతున్నాయి. కూరగాయల ధరలుఆకాశానంటుతూ ప్రజలజీవితాలను అతలాకుతలం చేస్తు న్నాయి.

గత రెండేళ్లుగా ఈ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తున్నా ఇప్పటివరకుఎలాంటిపటిష్టమైన కార్యాచరణ లేకపోవడం బాధాకరం.

ప్రణాళికబద్ధంగా సాగు, దిగుబడులు పెంచుతున్నామని చెబుతున్నా ప్రభుత్వాల మాట నిజమే అయితే ధరల పెరుగు దల ఎందుకు జరుగుతుందో అర్థంకావడం లేదు.

కూరగాయల రైతుల పట్ల ప్రభుత్వాలకు వసతితల్లి ప్రేమ ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/