క్షణాల్లో బ్రెడ్‌ దహివడ

రుచి: వెరైటీ వంటకాలు

పెరుగుతో చేసే ఈ టేస్టీ రెసిపి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో తెలుసుకుదాం.

కావలసిన పదార్థాలు :

4 బ్రెడ్‌ స్తైసెస్‌ ్ద 3/4 కప్పు నీళ్లు ్ద కొత్తిమీర చట్నీ ్ద తరిగిన పచ్చిమిరపకాయలు చింతపండు చట్నీ 1 టీ స్పూన్‌ పంచదార ్ద వేయుంచుకున్న జీలకర్రపొడి 1 టీ స్పూన్‌ కార •ఉప్పు ్ద 1/2 అమ్చుర్‌ పౌడర్‌ •ఎండు ద్రాక్ష • మజ్జిగ• కొత్తిమీర
• 2 ఉడికించిన బంగాళాదుంపలు ్దనల్ల ఉప్పు

తయారు చేయు విధానం :

బెడ్‌ స్లైసెస్‌ని తీసుకుని అంచులను కట్‌చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకోని దానిలో బంగాళ దుంపలను మాష్‌ (మెదిపి) చేయండి. పచ్చిమిరపకాయలు, అమ్చూర్‌ పౌడర్‌, ఎండుద్రాక్ష, వేయుంచుకున్న జీలకర్ర పొడి మరియు ఉప్పువేసి అన్నిటికి బాగా కలిపి ఒక పక్కన ఉంచుకోండి. పెరుగులో పంచదారను బాగా కలపి పెట్టుకోండి. బ్రెడ్‌ స్లైసెస్‌ని మజ్జిగలో కొంచెం తడిపి పెట్టుకొని అంతకముందు చేసుకున్న మసాలాను ఉండలుగా చేసి బ్రెడ్‌ మీద పెట్టి బాల్‌ లారా రోల్‌ చేసుకోండి.
ఫ్రై చేసుకునే ఆన్‌ని వాడండి అందులో కొంచెం నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తరువాత దానిలో బంగాళాదుంపలు ఫిల్లింగ్‌ కనిఇంచే వైపుగా బ్రెడ్‌ వడని వేసుకోండి. దీనిని మెల్లిగా వేయించడం ఎంతో ముఖ్యమైనది ఇది పిల్లింగ్‌ని బయటకు రానివ్వొద్దు. రెండు వైపులా మీడియం మంటపై వేయించండి. బ్రెడ్‌ వడలను ప్లేట్‌లోకి తీసుకోని దానిపై తీయటిపెరుగు, ఇంతపండు చట్నీ కొత్తిమీర చట్నీ, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసుకున్న తరువాత
మళ్లి కొద్దిగా పెరుగు, నల్లఉప్పు, కొత్తివీ వేసి బాగా సర్వ్‌ చేయండి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/