కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద భారీ పేలుడు..రక్తసిక్తంగా మారిన ప్రాంతం

అఫ్గానిస్థాన్​లోని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే కొంతమందికి గాయాలు అయ్యినట్లు సమాచారం. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది ఎయిర్​పోర్ట్​ బయట వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు అనంతరం గేట్ బయట కాల్పులు కూడా జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించే ఛాన్సులు ఉన్నట్లు అమెరికా, సహా పలు దేశాలు తమ ప్రజలను కోరాయి. వారు చెప్పినట్లు పేలుడు జరిగింది.

కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండటంతో.. భారీగా ప్రజలు కాబుల్ విమానాశ్రయ సమీపంలో గుమిగూడుతున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.