ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం పాకిస్ణాన్‌లో

జనవరి నెలలో 14.6 శాతం ద్రవ్యోల్బణం నమోదు

Pakistan
Pakistan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఆర్థిక రంగం ఆస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం మన పొరుగు దేశంలో నమోదైంది. పాకిస్థాన్‌ స్టేట్‌ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి నెలలో 14.6 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. దీంతో ద్రవ్యోల్బణాన్ని తగ్గిచండానికి దేశ అత్యున్నత బ్యాంకు వడ్డీ రేటును 13.25 శాతం వరకు పెంచించింది. దీంతో రుణాలు తీసుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాలేదు. తప్పనిసరిపరిస్థితుల్లో చేసేదేమీలేక వడ్డీ రేటును 5.5 శాతానికి తగ్గించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/