తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం కాడట – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వాళ్లే సీఎం అవుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే సీఎం అవుతారని అనడం తో అంత ఈయన వాక్యాలు గురించే మాట్లాడుకుంటున్నారు.

పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి దక్కించుకోవడంతో ఆ పదవిని ఆశించిన ఎంపీ కోమటిరెడ్డి..ఇప్పుడు సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీసాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై కూడా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. దళిత బంధుతో కేసీఆర్ పతనం తథ్యమని ఆయన అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే తాను రాజీనామా చేయడమే కాదు..తన కూతురు కవితకు భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇస్తే తాను మద్దతు ఇవ్వడమే కాదు ఆమెను గెలిపించి తీరుతానని తెలిపారు.