బీఆర్ఎస్‌తో పొత్తుపై బండి సంజయ్ క్లారిటీ

bandi-sanjay-in-karimnagar

పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పొత్తుల వ్యవహారం నడుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ లో బిజెపి తో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తలపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని బండి తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖత్వపు పార్టీ బీజేపీ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదని బండి ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీది మూడవ స్థానమేనని జోస్యం చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొత్త డ్రామా ప్రారంభించాయని మండిపడ్డారు.