గులాబీలతో అందం
అందమే ఆనందం

రసాయనలు వాడని గులాబీ రేకుల్ని గుప్పెడు తీసుకుని వాటిపి మెత్తగా నూరి చెంచా పంచదార, కాస్త తేనె, చెంచా పాలపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.
కొన్ని రోజు పూరేకులు, గుప్పుడు తులసి ఆకుల్ని ఓ పెద్ద చెంబు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటితో తరచూ ముఖం కడుక్కుంటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి.
వాటి తాలూకు మచ్చలు దూరం అవుతాయి. నాలుగైదు గులాబీల పూలరేకలు, పావుకప్పు పెసరపిండి, చెంచా వట్టివేళ్ల పొడి, చెంచా పాలు తీసుకుని ముఖానికి పూత వేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అంది తాజాగా కనిపిస్తుంది. అందమైన గులాబీ రేకులతో అందమైన ముఖం మీ సొంతమవ్ఞతుంది. మరి ఇలా ట్రైచేసి చూస్తారా?
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/