రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్ ప్రభుత్వం మరో తీపి కబురు..

తెలంగాణ లో వరుసగా నోటిఫికెషన్స్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్లో సంతోషం నింపుతుంది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ప్రకారం.. అబ్కారీ శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోస్టుల వివరాలు చూస్తే..
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఎస్సై పోస్టులు…అర్హతలు అనేవి చూస్తే.. 2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు. దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్సైతోపాటు స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానిక అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500, స్థానికేతరులైతే అన్ని కులాలవారూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ ఉద్యోగాలు…
2022 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు… 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు.రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. 40 ఏళ్లు దాటకుండా ఉండాలి. మహిళా కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), మహిళా వార్డర్లకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చారు. వితంతువులు, చట్టపరంగా భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లు మించకుండా ఉండాలి. మిగతా అన్ని కులాల్లో 18 – 35 మధ్య వయసున్న వారు అర్హులు.కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలయితే రూ.400, స్థానికేతరుతైలే కులాలతో సంబంధం లేకుండా రూ.800 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.