కేసీఆర్​తో ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ భేటీ

ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం హైదరాబాద్ వచ్చిన హేమంత్… సాయంత్రం ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా ఇతర అంశాలపై ఇద్దరు మాట్లాడినట్లు తెలుస్తుంది.

గతంలోనూ హేమంత్ సోరెన్ హైదరాబాద్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు. రీసెంట్ గా రాంచీ వెళ్లిన కేసీఆర్… గాల్వాన్ లోయలో మరణించిన ఝార్ఖండ్​కు చెందిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించారు. దేశ పరిస్థితులు, రాజకీయాలు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఇక ఇప్పుడు మరోసారి ఇరువురు భేటీ అవ్వడం రాజకీయంగా చర్చగా మారింది.