రైతు సమస్యలను పరిష్కరించాలి

గురజాల మాజీ ఎమ్మెల్యే ‘యరపతినేని’ దీక్ష

Ex MLA Yerapatineni

Guntur: కరోనా నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ కి చెందిన మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళే నిమిత్తం గుంటూరు లో గురువారం తన నివాసంలో కుమారుడు నిఖిల్ తో కలిసి ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు.

 రైతులకు గిట్టుబాటు ధర తో పాటు మార్కెటింగ్ రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం, కూరగాయలు, పండ్ల తోటల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరముందన్నారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయల భృతి ఇవ్వటం తో పాటు అన్న క్యాంటీన్ లను తక్షణే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, సిబ్బంది, పాత్రికేయులు అందరికీ రక్షణ కిట్ లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం :https://www.vaartha.com/specials/health/