కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవటం సమంజసం కాదు

-మంత్రి  ‘తలసాని’ వ్యాఖ్య

TS Minister Talasani Srinivasa Yadav

Hyderabad: కేంద్ర ప్రభుత్వం సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవటం సమంజసం కాదని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించి వలస కార్మికుల తరలింపుకు ఉచితంగా రైళ్ళను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

బన్సీలాల్ పేట లో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.  ఆయా రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాద్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులలో తరలించాలని నిర్ణయించడం సరైంది కాని తలసాని అన్నారు. తెలంగాణలో  బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని అన్నారు. 

తెలంగాణ నుండి బీహార్, జార్ఖండ్, చత్తీస్ బస్సులలో వెళ్లేందుకు సుమారు 3 నుండి 5 రోజుల సమయం పడుతుందని రైళ్ళలో ఆయా రాష్ట్రాలకు వలస కూలీలను చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బస్సుల ద్వారా స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/