మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా

రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి రైతులు ఆందోళనలపై మాట్లాడూతూ… రైతుల ఆందోళనలకు యాభై రోజులు పూర్తయ్యాయని పవన్‌ అన్నారు. రైతులు, ఆడపడచుల స్ఫూర్తి చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని అన్నారు. రోడ్డుపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా నినదిస్తానని, రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/