ఏపిలో 304 కు చేరిన కరోనా కేసులు

నిన్న సాయంత్రం నుండి నేటి ఉదయం వరకు ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా కేసుల సంఖ్య 304 కు చేరింది. నిన్న సాయంత్రం నుండి నేటి ఉదయం 9 గంటల వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలలో నిన్న సాయంత్రం 6నుంచి ఈ రోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్‌ పరీక్షల్లో కొత్తగా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూల్‌ జిల్లాలో కోవిడ్‌-19 కారణంగా ఒక మరణం నిర్దారించబడింది. అని ఆరోగ్యశాఖ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/