నారా లోకేష్ ఆరోపణలను ఖండించిన APSRTC

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అడుగడుగునా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై విరుచుకపడుతున్నాడు లోకేష్. ఈ క్రమంలోనే లోకేష్‌తో ఓ ఏపీఎస్‌ఆర్టీసీ బస్ డ్రైవర్‌ కరచాలనం చేశారు. తన మొబైల్‌కు ఉన్న చంద్రబాబు కవర్‌ను అందరికీ చూపిస్తూ ప్రదర్శించారు. అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్ తనకు కరచాలనం చేశారని ఉద్యోగం నుంచి తొలగించారని లోకేష్ ఆరోపించారు.

తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని..ఇది పాలకుల్లో ఉన్న భయానికి నిదర్శనమని, పాదయాత్ర పట్ల భయం లేకపోతే తమ ప్రచార వాహనాలను ఎందుకు సీజ్ చేసారని , తనతో కరచాలం చేసిన డ్రైవర్ ను ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోషల్ మీడియా లో సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో APSRTC క్లారిటీ ఇచ్చింది.

డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలిగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ చెబుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇది పూర్తిగా తప్పుడు కథనమని.. కొన్ని మీడియాల్లో వచ్చిన ఈ వాదనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.