చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రో మాజీ చైర్మన్ హర్షం

చంద్రయాన్ 3 సక్సెస్ తో ఇండియా పేరు మరోసారి ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. గత 40 రోజులుగా ఉన్న ఉత్కంఠ కు తెరపడింది. చంద్రయాన్ సక్సెస్ తో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురు చూశానన్నారు.

ఈ విజయం కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని , ఇది చాలా స్వీట్ న్యూస్ అని, దేశమంతా ఎదురుచూస్తోన్న ఈ ప్రయోగం ఇప్పుడు విజయవంతమైందని అన్నారు. అద్భుత విజయం సాధించినందుకు గాను దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం కూడా సహకరించినట్లు చెప్పారు. చంద్రయాన్-3 పంపించే సైన్స్ డేటా ఒక్క భారత్ కోసమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి కోసం అన్నారు. ఈ డేటా ద్వారా ప్రపంచ సైంటిస్ట్‌లు కొత్త విషయాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుందన్నారు.