ఏపీలో కరోనా ఉధృతి

పాజిటివ్ కేసుల సంఖ్య 3,843

corona cases in AP
corona cases in AP

Amaravati: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో 125 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,843కు చేరుకుంది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల వారి కేసులు 838, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి కేసులు 126 రాష్ట్ర పరిధిలో నమోదయ్యాయి.

వీటన్నింటితో కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,813కు చేరుకుంది. కాగా కొత్తగా 34 మంది కరోనా బాధితులు కోలుకుని, డిశ్చార్జి అయ్యారు.

దీంతో కరోనా నుంచి బయట పడిన వారి సంఖ్య 2,387గా ఉంది. అలాగే 75 మంది ఇప్పటి వరకు కరోనాకు బలి కాగా.. ప్రస్తుతం 1,381 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల వారికి చెందిన కేసులలో 520 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఫారన్‌ రిటర్నర్స్‌లో 126 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు కరోనా కల్లోలం కొన సాగుతుండటంతో రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలను భారీగా పెంచు తున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో 14,246 మందిని పరీక్షించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రం లో అత్యధిక స్థాయిలో 4లక్షల 68 వేల 276 నిర్థారణ పరీక్షలు చేపట్టారు.

వీటిలో 4లక్షల 63వేల 463 మందికి నెగిటీవ్‌ రిపోర్టు వచ్చింది.

కాగా కరోనా నిర్థారణ పరీక్షల్లో ఏపీనే మొదటి స్థానంలో కొనసాగుతోంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/