చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ సక్సెస్‌

చంద్రుడిని ముద్దాడిన విక్రమ్ ల్యాండర్

chandrayaan-3-successfully-landed-on-moon

బెంగళూరుః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. భారత్‌ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్‌ సురక్షితంగా అడుగుపెట్టింది. నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై దిగింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రుడి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్‌-3 పరిశోధించనుంది.

కాగా, చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.05 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.