కొత్త పాలసీతో ప్రతి ఏడాది చేతికి రూ.లక్ష!

Life Insurance

ముంబై: ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పడం కష్టమే. అందుకే భవిష్యత్‌ గురించి ఇప్పటినుంచే ప్లాన్‌ చేసు కోవాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు శాలరీ వస్తుంది. దీంతో అవసరాలు తీర్చుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆదాయం ఉండదు.

అందుకే రిటైర్మెంట్‌ కోసం ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకోవాలి. మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మిత్సు సుమిటొమో ఇన్సూరెన్స్‌ సంస్థల జాయింట్‌ వెంచర్‌ అయిన మ్యాక్స్‌ గ్రూప్‌ కంపెనీ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ రెగ్యు లేటర్‌ ఐఆర్‌డిఎఐ కొత్త నిబంధనలను అనువుగా ఈ పాలసీ రూపొందింది. మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ మ్యాక్స్‌ లైఫ్‌ గ్యారంటీడ్‌ లైఫ్‌టైమ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌ పేరుతో ఈ కొత్త పాలసీ తీసుకువచ్చింది.

ఇది యాన్యుటీ ప్లాన్‌. రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేసే వారికి ఈ పాలసీ అనువుగా ఉంటుంది. మ్యాక్స్‌ లైఫ్‌ కొత్త యాన్యుటీ ప్లాన్‌లో మరో ఆప్షన్‌ ఉంది. దీని పేరు డిఫర్డ్‌ యాన్యూటీ. ఈ ఆప్షన్‌ ఎంచు కుంటే, అధిక యాన్యుటీ రేట్లను ఇప్పుడు లాక్‌ చేసుకోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో ప్రయోజనం లభిస్తుం ది. రిస్క్‌లేని యాన్యుటీ పేమెంట్‌ వస్తుంది.

మ్యాక్స్‌ కొత్త పాలసీతో పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఫ్లెక్సిబుల్‌ పేమెంట్‌ మోడ్స్‌, టాప్‌ అప్‌ ఆప్షన్‌, డెత్‌ బెనిఫిట్స్‌, లోన్‌ ఫెసిలిటీ, సరండర్‌ ఆప్షన్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మ్యాక్స్‌ కొత్త యాన్యుటీ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సింగిల్‌ లైఫ్‌, రెండవది జాయింట్‌ లైఫ్‌ అనేవి. జాయింట్‌ లైఫ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే, సబ్‌స్రైబర్‌తోపాటు భాగస్వామికి కూడా యాన్యుటీ మొత్తం లభిస్తుంది.

పాలసీ తీసుకునే సమయంలో యాన్యుటీ మొత్తం నిర్ణయమవుతుంది. అంతేకాకుండా టాప్‌ అప్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీన్ని ఎంచుకుంటే యాన్యుటీ మొత్తాన్ని పెంచుకో వచ్చు. పాలసీ టర్మ్‌లో ఎప్పుడైనా కంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని పెంచుకోవడానికి సబ్‌స్రైబర్‌కు వెసులుబాటు ఉంటుంది. దీని కోసం టాప్‌ అప్‌ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

అధిక యాన్యుటీ లభిస్తుంది. యాన్యుటీ మొత్తాన్ని మీకు నచ్చిన ప్పుడు తీసుకునే ఆప్షన్‌ ఉంది. ఏడాదికి లేదంటే ఆరు నెలల చొప్పున తీసుకోవచ్చు. ఇది కూడా లేదంటే నెల వారీగా కూడా యాన్యుటీ మొత్తాన్ని పొందవచ్చు.

దీంతో రెగ్యులర్‌గా ఆదా యం వస్తుంది. పాలసీదారుడికి పాలసీ నచ్చకపోతే, ఎప్పుడై నా తిరిగి వెనక్కి ఇచ్చేయవచ్చు. అంతేకాకుండా యాన్యుటీ పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు. మీకు డబ్బుతో అత్యవసరం వచ్చినపుపడు ఈ ఆప్షన్‌ ఉపయోగించుకోవచ్చు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/