ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కి ఓటమి ఖాయం

హుజూరాబాద్ లోఈటల ఘన విజయం సాధించబోతున్నారు..డీకే అరుణ

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈటల ఘన విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. తలకిందులు తపస్సు చేసినా హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలవలేదని అన్నారు. ఈటల రూపంలో తెలంగాణలో బీజేపీకి మరో ఎమ్మెల్యే పెరగబోతున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ తీరుతో తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ మద్దతుతోనే కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతోందని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/