కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఈటెల క్లారిటీ

కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తో మిగతా రాష్ట్రాల్లోను కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయాయ్యి. ముఖ్యంగా తెలంగాణ లో ఈ విజయం ..కొత్త ఉత్సహాన్ని ఇస్తుంది. ఇదే తరుణంలో పలు పుకార్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. పలువురు బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిపై ఈటెల క్లారిటీ ఇచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా గార్ల నాయకత్వంలో ఒక సైనికుడిలా పని చేస్తున్నానని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమొందిచడమే నా లక్ష్యం. అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది అని నమ్మినవాడిని, బీజేపీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురవేయడం కోసం అనుక్షణం అలుపెరగని పోరాటం చేస్తున్న.. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ మార్పుపై పత్రికల్లో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.