వైఎస్ షర్మిలపై కేసు నమోదు..

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఫై కేసు నమోదైంది. TSPSC పేపర్ లీకేజి విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.

‘సీఎం కేసీఆర్ పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అనే మహా బిల్డప్ ఇస్తారు కదా..మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి. TSPSC పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా? పిల్లలకోసం ఆలోచిస్తున్న వారైతే, వారి బతుకులతో ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి. 80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు, ఒక CM సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండని’ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

‘అయ్యా కేసీఆర్ సారు..TSPSC పేపర్ లీకులపై నోరు విప్పండి. నిరుద్యోగుల గోసను గుర్తించండి. మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని యాది తెచ్చుకోండి. బంధి పోట్ల రాష్ట్ర సమితి విస్తరణకు దేశ రాజకీయాలు ఆపి, తెలంగాణ బిడ్డలకు భరోసా ఇవ్వండి. ఈ అఫిడవిట్ పై సంతకం పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయండని’ షర్మిల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఫై బిఆర్ఎస్ కార్యకర్త పోలీసులకు పిర్యాదు చేసాడు.