సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరిన వైఎస్ షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ..సీఎం కేసీఆర్ ఫై విమర్శలు చేయడం ఆపడం లేదు. మొన్నటి వరకు షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ..ప్రస్తుతం విలీన కార్యక్రమాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే మళ్లీ కేసీఆర్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. సోమవారం బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడం ఫై షర్మిల సెటైర్లు చేసింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను తన్ని తరిమేస్తారని ఆయనకు అర్థం అయినట్లు ఉందని వైఎస్ షర్మిల అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం ఇదని అన్నారు. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండని ఎద్దేవా చేశారు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాలు విసిరారు.