విడాకులు తీసుకున్న పాపులర్ హీరోయిన్

చిత్రసీమ లో పెళ్లిళ్లు..విడాకులు అనేవి కామన్..సినిమా షూటింగ్ లలో దగ్గరవ్వడం..ఆ తర్వాత సహజీవనం సాగించడం..ఆ తర్వాత పెళ్లి , విడాకులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఇలా చాలామంది నిలిచారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర-హేమమాలిని కూతురు, హీరోయిన్ ఈషా డియోల్ తన భర్త భరత్ తక్తానీకి విడాకులిచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ఇరువురు అధికారికంగా ప్రకటించారు.

ఇద్దరు పిల్లల సంరక్షణ తమకు చాలా ముఖ్యమని తెలిపారు. 2002లో ‘కోయి మేరే దిల్ సే పూచే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈషా.. దాదాపు 30 చిత్రాల్లో నటించారు. 2012లో భరత్ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కొద్దీ రోజులుగా బాలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు వాటిని ఖరారు చేసారు.