ఏపిలో ఉపాధ్యాయుల బదిలీలకు సిఎం గ్రీన్‌సిగ్నల్‌

జులై 15 తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో బదిలీల ప్రక్రియ

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్ ఏపిలో ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడునేడు’ కార్యక్రమంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు విద్యార్థులకు మంచి చేసేలా ఉండాలని అన్నారు. పదో తరగతి పరీక్షల తర్వాత ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు ఉండాలన్నారు. ఏయే పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మ్యాపింగ్ చేయాలన్నారు. టీచర్ల రీపొజిషన్‌కు, పిల్లలకు మంచి జరిగేలా విధివిధానాలు రూపొందించాలన్నారు.

టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు జులై 15 తర్వాత ఆన్‌లైన్ విధానంలో టీచర్ల బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూయడానికి వీల్లేదని జగన్ ఆదేశించారని, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేలోపు బదిలీలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/