రాజుకు జ్ఞానోపదేశం

Devotional

మానవ జన్మ లభించడం దుర్లభమైన విషయం. దుర్లభంగా లభించిన ఈ జన్మపూర్ణత్వాన్ని సాధించే దిశగా పయనించాలి. వివేక చిత్తంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యతనిస్తూ గురుపరంకు, వారి జ్ఞానోపదేశానికి దాసులం కావాలి. ఎంతో మంది రాజులు, శిష్యులు,గురువ్ఞల జ్ఞానోపదేశంతో వారి జీవితాలను పునీతం చేసుకున్నారు. కేవలం దేహ పోషణతోనో ఆహార నిద్రా భయమైదుననాలతోనో కాలహరణం చేయకూడదు. సద్గురువ్ఞను పొందటం ఆచరించటం, సాధు ఆసంగత్యం చేయటం, భగవత్‌ కథాలీలల్ని వినటం వాటన్నింటినీ జీవితానికి అన్వయించుకొని సంసారసాగరాన్ని దాటే ప్రయత్నం చేయాలి. వీటిని త్యజించిన వారు ఆత్మఘాతకులు అవ్ఞతారని ఉద్ధవ్ఞనితో భగవంతుడు వివరించాడు.

ఆత్మఘాతకుడంటే దుర్లభంగా లభించినటువంటి మావన జన్మను భగవత్‌ ప్రాప్తికి భగవత్‌ సేవకు, సత్కార్యాచారణకు వినియోగించకుండా కేవలం ఇంద్రియభోగాల కోసం వినియోగించే వారని అర్ధం. అలాంటి జీవితం అస్తవ్యస్తంగా ముగుస్తుందేగాని, శాంత చిత్తంతో ఏ కోణంలోనూ కనిపించదు. మానవజన్మను ఎత్తినవాడు మానవ జన్మకు సంబంధించిన కర్మలను ఆచరించినపుడే మానవ్ఞనిగా జన్మకు సంబంధించిన కర్మలను ఆచరించినపుడే మానవ్ఞని గుర్తింపబడతాడు. ఇంద్రియ మనో బుద్ధులను దాటి బుద్ధి స్థితిలోకి చేరి భగవత్‌ ప్రీతిపాత్రమైన పనులతో జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మానవదేహం ఒక చక్కటి నావతో పోల్చబడింది.

ఆ నావను నడపడానిక ఒక నావికుడు కావాలి. అదే మనసు. ఆ మనసును ఎప్పటికప్పుడు పూర్తి చేయవలసిన కర్మలను నిర్వర్తించటానిఇ సన్నద్ధం చేసేందుకు ఒక గురువ్ఞ కావాలి. కావ్ఞన గురుఏ కేంద్ర బిందువ్ఞ. గురుముఖతా నేర్చుకున్న అంశాలను మనసు శరీరం ద్వారా పూరింటానికి సిద్ధమవ్ఞతుది. ఆపుడు భగవంతుని లీలా కటాక్షాలు పవనాలుగా తోడై సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్న నావను ఒడ్డుకు చేరుస్తాయి. దేహం, అందం శాశ్వతాలు కావ్ఞ. మన దేహమే ధర్మసాధనానికి మాధ్యమమన్న విషయాన్ని శాస్త్రం వివరిస్తుంది. మనసొక్కటే ఏమీ చేయలేదు. మనసు శరీరాన్ని అంటిపెట్టుకుని తద్వారా వివిధ కార్యాలు ఒనరించవచ్చు.

పరమధర్మసాధనకు పరమోత్తమమైన సాధనమైన ట్టి మానవ జన్మ దుర్లభమైనది. ఇహలోక విషయాలకు విలువనిచ్చిన కళింగురరాజు వియవర్మ తన కులగురువ్ఞ ద్వారా జ్ఞాఓపదేశం పొంది జీవితాన్ని చరితార్ధం చేసుకున్న కథ ఒకటుంది. విజయవర్మ తన అందం ఐశ్వర్యంతో పొంగిపోయేవాడు. అదే సర్వస్వం జీవితం అనుకున్నాడు. విజయవర్మకు తన కులగుయి తత్వబోధచేసి దేహాభిమానాన్ని తగ్గించుకోమని హితవ్ఞ చెప్పాడు. కానీ రాజు పెడచెవిన పెట్టాడు. ఒకరోజు రాజు మంత్రితోకలిసి మారువేషంలో నగర సంచారం చేస్తుండగా వర్షం వచ్చింది. దారిన కొట్టంంలో తలదాచుకున్నారు.

యజమాని కూర్చోమన్నాడు. రాజు కూర్చున్నాడు. వర్షంలో తడుస్తూ భిక్షగాడు, వ్యాధిగ్రస్తుడు, ఆవ్ఞలు తడుస్తూ కొట్టంలోకివచ్చాయి. కొట్టంలో శవాన్ని పెడతామని కొందరు వచ్చారు.యజమాని ససేమిరా అన్నాడు. జమీందారైనా సరే, రాజైనా సరే శవాన్ని పెట్టడానికి వీల్లేదన్నాడు. అది చూసిన రాజుకు నెత్తిన పిడుగుపడినట్లయింది. ప్రాణం పోయాక తన దేహానికి ఇచ్చే విలువ అర్ధమమైంది. వెంటనే కులగురువును ఆశ్రయించి జ్ఞ్ఞానోపదేశం చేయమన్నాడు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/