నాకౌట్‌ దశకు అర్హత సాధించిన పుణె

పుణె ఖాతాలో 7 ఏసెస్‌ పాయింట్లు

Chirag rituparna loh guide pune
Chirag rituparna loh guide pune

హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌ బీవెన్‌ జాంగ్‌కు భారత యువ షట్లర్‌ రితుపర్ణ దాస్‌ షాక్‌ ఇవ్వడంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో పుణె సెవెన్‌ ఏసెస్‌ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ స్టార్స్‌, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ సెమీస్‌ చేరగా.. పుణె మూడో జట్టుగా నిలిచింది. జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణే 41తో అవధె వారియర్స్‌పై గెలుపొందింది. ఈ విజయంతో 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే 7 ఏసెస్‌ పాయింట్ల పట్టికలో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. మిగిలిన మరో బెర్త్‌ కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఈ రోజు మ్యాచ్‌ల్లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో చెన్నై సూపర్‌ స్టార్స్‌; బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/