ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే..
జీవన వికాసం

ఆత్మవిశ్వాసం పెరగడానికి చెప్పేందుకు చాలానే ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే అనిపిస్తాయి. పాటించాల్సి వచ్చేసరికి అసలు సమస్యలు మొదలవుతాయి.
చిట్కాలన్నీ పక్కన పెట్టి పని చేసుకుపోవడమే మంచిదనిపిస్తుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అప్పుడయినా తెలుసుకుంటేనే మంచిదనిపించవచ్చు. కొంతమంది నిటారుగా నడుస్తారు.
కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి అబ్బో వాళ్ల మీద వాళ్లకు ఎంత నమ్మకం అనిపిస్తుంది.
అయితే నిటారుగా కూర్చుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందా అనే సందేహం అమెరికాలోని కొంతమంది పరిశోధకులు ఓ పయోగం చేశారట.
అందుకు 71 మందిని ఎంచుకుని ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్ లక్షణాలు, మూడు నెగెటివ్ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి’ అని అడిగారు.
అలా రాసే సమయంలో సగం మంది నిటారుగా కూర్చుని రాయాలని, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలని సూచించారు.
నిటరుగా కూర్చుని రాసిన వాళ్లు తమలో ఉన్న పాజిటవ్ లక్ష ణాలను చాలా బాగా ప్రజెంట్ చేయగలిగారు. అదే సమయంలో నెగిటివ్ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు.
ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటవ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసారు.
ఇక నెగిటివ్ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు.

విచిత్రం ఏమిటంటే నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది.
ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు.
నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల మన ఆలోనల్లో స్పష్టత వస్తుందని, అదే కాన్ఫిడెన్సుకి దారి తీస్తుందని చెపుతున్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/