తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

encounter

హైదరాబాద్‌ః ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత సంఘటనాస్థలంలో ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. అనంతరం.. ఘటనాస్థలంలో ఏకే-47 సహా మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, గత సోమవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే అనుమానిత ప్రాంతల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.