రోమ్‌లో చిక్కుకున్న 70 మంది భారతీయ విద్యార్థులు

కరోనా వైరస్ సోకలేదని ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్న వైనం

Plea to bring home students stuck in Italy
Plea to bring home students stuck in Italy

రోమ్‌: ఇటలీలోని రోమ్‌ విమానాశ్రయంలో 70 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్వదేశానికి వచ్చేందుకు అటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కానీ, ఇటు ఎయిరిండియా కానీ వారికి బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోవడంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. కరోనా బాధిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్ సోకలేదని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే దేశంలోకి అనుమతిస్తామన్న భారత ప్రభుత్వ నిబంధన కారణంగా వారికి బోర్డింగ్ పాసులు ఇచ్చేందుకు విమానయాన సంస్థలు నిరాకరిస్తున్నాయి. వసతి, భోజన సదుపాయం లేకుండా విమానాశ్రయంలో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని, ప్రధాని మోడి స్పందించి తమను స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/