అత్యవసర ఔషధాలు సరాఫరా చేయండి.. స్పేయిన్‌

సానుకూలంగా స్పందించిన భారత్‌

jaishanker
jaishanker

స్పేయిన్‌: కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటికే స్పేయిన్‌ చాలా ప్రాణాలు కోల్పోయారు. కాగా అక్కడి పరిస్థితిపై స్పేయిన్‌ విదేశాంగ మంత్రి అరంచా గొంజాలెజ్‌తో భారత విదేశి వ్యవహరాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ చర్చించారు. ఇందుకు సంబందించిన వివరాలను జైశంకర్‌ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. స్పేయిన్‌ ఫారిన్‌ మినిస్టర్‌ అరంచా గొంజాలెజ్‌తో ఫోన్‌లో మాట్లాడా.. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల సహకారం అవసరం అని మేమిద్దరం అంగీకరించాం. అలాగే స్పేయిన్‌కు అత్యవసర ఔషధాలు సరాఫరా చేయాలన్నా విజ్ఞప్తిపై భారత్‌ సానుకూలంగా స్పందించింది. అని జై శంకర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/