ఆ ఎనిమిది నెలలు నరకం చూశాను.. పృథ్వీషా

అలా ఎవరికి జరగకూడదు

prithvi shaw
prithvi shaw

ముంబయి: గత సంవత్సరం డోపింగ్‌ టెస్ట్‌లో విఫలమై ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పృథ్వీషా, ఆ ఎనిమిది నెలల కాలంలో నరకాన్ని చూశానని పేర్కోన్నాడు. ఇలా ఎవరికి జరగకూడదు. చిన్న తప్పుకు డోపింగ్‌ దొరికిపోయిన దానికంటే, కొందరు చేసే విమర్శలు చాలా భాధించాయని షా పేర్కోన్నాడు. ఆ సమయంలో చాలా ఓర్పుగా ఉన్నాను. విమర్శలకు అన్నింటికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని అనుకున్నట్లు షా తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/