సింగరేణిలో కరోనా కలకలం

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

singareni workers
singareni workers

కరీంనగర్‌: సింగేణిలో కరోనా కలకలం రేపుతుంది. ఇటీవల ఢిల్లీ మత ప్రార్ధనలు వెలుగులోకి వచ్చాక వారిని పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సింగరేణికి చెందిన ఒక కార్మికుడు డిల్లి మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చాడు. అతనిని పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతని కుటుంబంలో అతని కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాని అతడు ఢిల్లి నుండి వచ్చాక కొన్ని రోజులపాటు విధుల్లో ఉండడంతో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీనితో వెంటనే స్పందించిన సింగరేణి యాజమాన్యం అతడితో కలిసి పని చేసిన కార్మికులందరూ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. ఎవరికయిన కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/