ఒక్క వర్షం దెబ్బకు తెలంగాణ వ్యాప్తంగా పడిపోయిన విద్యుత్తు డిమాండ్‌

మంగళవారం రాష్ట్రం మొత్తం చల్లబడడంతో విద్యుత్తు వినియోగం భారీగా పడిపోయింది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టడంతో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయిలో జరిగింది. కానీ నిన్నటి వర్షంతో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 2000 మెగావాట్ల వాడకం తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే ఖమ్మంలో 315 మెగావాట్ల విద్యుత్తు వాడగా, అదే మంగళవారానికి వచ్చేసరికి కేవలం 55 మోగావాట్లే వినియోగించారు. అంటే దాదాపు 260 మెగావాట్లు డౌన్‌ అయ్యింది.

రాష్ట్రవ్యాప్తంగా 2000 మెగావాట్ల వాడకం తగ్గిపోయింది. సోమవారం ఒక్కరోజే ఖమ్మంలో 315 మెగావాట్ల విద్యుత్తు వాడగా, అదే మంగళవారానికి వచ్చేసరికి కేవలం 55 మోగావాట్లే వినియోగించారు. అంటే దాదాపు 260 మెగావాట్లు డౌన్‌. అదే వరంగల్లో 476 నుంచి 163, కరీంనగర్‌ 838 నుంచి 413, ఆదిలాబాద్‌ 285 నుంచి 82, నిజామాబాద్‌ 395 నుంచి 208 మోగావాట్లకు విద్యుత్తు వినియోగం పడిపోయింది. ఇలా రాష్ట్రమంతటా విద్యుత్తు వినియోగం తగ్గిపోయింది అని అధికారులు తెలిపారు.