ఆ ఎలక్టోరల్ బాండ్స్ డోనర్లు ఎవరో?

లోక్‌సభ ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్‌ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్‌ బాండ్లు వ్యతిరేకమని పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు, ఆ బాండ్ల విలువ, వాటిని స్వీకరించిన వారి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించే ఎస్‌బీఐని.. 2019 ఏప్రిల్‌ 12 నుంచి విక్రయించిన బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోపు ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పించాలని, మార్చి 13లోపు ఆ వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో బహిరంగపరచాలని ఆదేశించింది. నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదార్ల ఖాతాల్లో తిరిగి జమ చేయాలని ఎస్‌బీఐకి ఆదేశాలు జారీ చేసింది.

పార్టీలకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్లో 94% రూ.కోటి డినామినేషన్ కు చెందినవేనని తెలుస్తోంది. రూ. 1000, రూ. 10వేలు, రూ.లక్ష, రూ. పది లక్షలు, రూ.కోటి డినామినేషన్లతో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయొచ్చు. 2018 మార్చి నుంచి ఈ ఏడాది జనవరి మధ్య పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా .16,518.11 § 2.