చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు – మంత్రి రోజా

బుధువారం కందుకూరు లో జరిగిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడి హాస్పటల్స్ లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన పట్ల వైస్సార్సీపీ ..చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఈ ఘటన ఫై స్పందించగా…తాజాగా మంత్రి రోజా చంద్రబాబు ఫై మండిపడ్డారు. తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడంటూ చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి రోజా.

గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీటింగ్ లో జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అన్నారు. చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలని.. ఇది రాజకీయ హత్య అన్నారు మంత్రి రోజా. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలు తీశాడని.. ఇప్పుడు 8 మంది ప్రాణాలను బలిగొన్నాడని వ్యాఖ్యానించారు.

మరోపక్క ఈ ఘటన పట్ల ఎస్పీ విజయరావు స్పందించారు. కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు సభ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారని, అయితే తాము అనుమతి ఇచ్చిన ప్రాంతం కంటే చంద్రబాబు 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారని వెల్లడించారు.

తాము అనుమతి ఇచ్చిన ప్రాంతంలో తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదని, చంద్రబాబు ఇరుకుగా ఉన్న రోడ్డులోకి వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందని ఎస్పీ వివరించారు. జనం ఒక్కసారిగా నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో పిచ్చయ్య అనే వ్యక్తి గాయపడ్డాడని, అతడి ఫిర్యాదు ఆధారంగా 174 సీఆర్పీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ విజయరావు వెల్లడించారు.