భార‌త్‌ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం..మైక్రోసాఫ్ట్ ఆందోళ‌న

China will use AI to disrupt elections in the India, Microsoft warns

న్యూఢిల్లీ: భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగ‌న్ దేశం లోక్‌స‌భ ఎన్నిక‌లపై ప్ర‌భావం చూపే ఛాన్సు ఉన్న‌ట్లు ఓ రిపోర్టులో తెలిపింది. ఏఐ ఆధారిత కాంటెంట్‌తో అమెరికా, ద‌క్షిణ కొరియా దేశాల ఎన్నిక‌ల‌పైన కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. ఎన్నిక‌ల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్‌ను సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్ర‌చారం చేయ‌నున్నార‌ని, కీల‌క‌మైన ఎన్నిక‌లు త‌మ‌కు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని మైక్రోసాఫ్ట్ త‌న రిపోర్టులో చెప్పింది. మీమ్స్‌, వీడియోలు, ఆడియో రూపంలో ఆ కామెంట్ ఉంటుంద‌ని, చైనా పొజిష‌న్‌ను స‌పోర్టు చేసే రీతిలో వాటిని రూపొందించ‌నున్నారు. అయితే ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌భావం చూప‌డం త‌క్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్య‌క్తం చేసింది.