రేపు ‘వైఎస్సార్ ఆసరా రెండో విడత’ నిధులు విడుదల చేయబోతున్న జగన్

వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమానికి ఎన్నికల కమిషన్‌ ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో రేపు రెండో విడత నిధులు విడుదల చేయబోతున్నారు జగన్. రేపు ఒంగోలులో ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంజయ్య రోడ్డులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసు శిక్షణ కళాశాలలోని హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు.

రేపు ఉదయం 9.55 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలు పీటీసీలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. 10.45 గంటలకు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలోని సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. 11 గంటలకు పాఠశాలకు చేరుకుని స్టాల్స్‌ సందర్శన; రాష్ట్ర మంత్రుల ప్రసంగం, ఆసరా లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 12 నుంచి 12.30 గంటల వరకు సీఎం జగన్‌ ప్రసంగం కొనసాగనుంది.. 12.30కు వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం ప్రారంభించనున్నారు.

రెండో విడత కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది సభ్యులకు రూ.6,439 కోట్లు అందించనుంది.