రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ

హైదరాబాద్: సీఎం కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూసే ఆశావహులకు కేసీఆర్‌ ప్రకటన ఊరటనిచ్చింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/