షూటింగ్ లో కన్నీరు పెట్టుకున్న సమంత

విడాకుల ప్రకటన తర్వాత షూటింగ్ లో జాయిన్ అయినా సమంత..బ్రేక్ సమయంలో కన్నీరు పెట్టుకుంది. గత వారం సమంత ..తన విడాకుల ప్రకటనను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియా కు దూరంగా ఉన్న ఈమె..తాజాగా ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంది.

హైదరాబాదులోని మకరం ఝా జూనియర్ కళాశాలలో ఈ యాడ్ షూటింగ్ జరిగింది. షూటింగ్ లో బ్రేక్ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాడ్ ను ముంబై బేస్డ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ తీస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సమంత విడాకుల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యాడ్ షూటింగ్ కు ఆమెకు వస్తుందా..? రాదా..? అనే అనుమానంలో ఉండగా..సమంత మాత్రం యాడ్ షూటింగ్ కు వచ్చి , తన ప్రొఫెషనలిజంను చాటుకుంది. ఇక సోషల్ మీడియా లో మాత్రం సమంత ఫై అంత మండిపడుతున్నారు. ఈమె ప్రవర్తన వల్లే చైతు విడాకులు ఇచ్చారనే కామెంట్స్ చేస్తున్నారు.