తెలంగాణలో 20కి పైగా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారన్న అభియోగాలు

ed-raids-continue-in-telangana-medical-colleges

హైదరాబాద్‌ః తెలంగాణలో మెడికల్ కాలేజీలపై ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. ఈడీ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నాయి. మెడికల్ పీజీ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై బీఆర్ఎస్ కీలక నేతలకు చెందిన మెడికల్ కాలేజీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి.

ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో రెండు రోజులుగా ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి.