నీ ఆస్తులు, నా ఆస్తులపై చర్చకు సిద్ధమాః గంగులకు బండి సవాల్‌

గంగులకు తొలుత బీఫామ్ కూడా ఇవ్వలేదన్న బండి సంజయ్

Bandi Sanjay challenges to Gangula Kamalakar

హైదరాబాద్ః మంత్రి గంగుల కమలాకర్, బిజెపి నేత బండి సంజయ్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గంగుల అవినీతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా వాటా ఉందని సంజయ్ ఆరోపించారు. టికెట్లు అమ్ముకున్నానని తనపై గంగుల ఆరోపణలు చేస్తున్నారని… టికెట్లు అమ్ముకోవడానికి తాను అధ్యక్షుడిని కాదని చెప్పారు. నువ్వో మరో కేఏ పాల్ అని… తొలుత నీకు బీఫామ్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రస్టేషన్ లో గంగుల ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు లక్ష సెల్ ఫోన్లను పంచుతున్నారని ఆరోపించారు. నీ ఆస్తులు, నా ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే… కెసిఆర్ ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు.