శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్

Pawan kalyan

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్టోబర్ 02 న ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు. అటు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓ రోడ్డుకు మరమ్మతు చేపట్టే కార్యక్రమాన్ని జనసేన చేపట్టనుంది.