కేజీవాల్ ఫై కోర్టులో ఈడీ ఫిర్యాదు

మనీలాండరింగ్ కేసులో సీఎం కేజీవాల్ ఫై ED ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. విచారించేందుకు కేజీవాల్ కు పలుమార్లు సమన్లు పంపినా కేజీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ కోసం కేజీవాల్ను కోర్టు ఆదేశించాలని కోరింది. ఈరోజు కోర్టు విచారణ చేపట్టనుంది. మొదటి మూడు సమన్లకు కేజీవాల్ స్పందించలేదని ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించింది.

మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై చర్య తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టులో తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే 8 సార్లు సమన్లు పంపినా వాటిని లెక్కచేయలేదని ఆరోపిస్తూ ఐపీసీ 174 సెక్షన్‌ కింద తాజా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును ఈ నెల 16న విచారించనున్నట్టు కోర్టు తెలిపింది. అయితే మార్చి 12 తర్వాత వర్చువల్‌గా తాను విచారణకు హాజరు అవుతానని కేజ్రీవాల్‌ ఇదివరకే తెలిపారు.