నేడు కాంగ్రెస్ తొలి జాబితా!

Congress

నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి వివరించనున్నారు.

గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. ఈరోజు తొలి జాబితా వెలువడే అవకాశముంది. ఈ లిస్ట్ లో తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరికాసేపట్లో రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు.