“సింక్‌”తో ట్విట్టర్‌ ఆఫీసుకు వెళ్లిన ఎలన్‌ మస్క్‌

Elon Musk tweets video of him walking into Twitter headquarters with a sink, updates bio

శాన్ ఫ్రాన్సిస్కో: టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ శాన్‌ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న ట్విట్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈసందర్బంగా ఆయన తన చేతులో ఓ సింక్‌ పట్టుకుని వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మస్క్‌ షేర్‌ చేశారు. ట్విట్టర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్‌ అవుతున్నానని, ఇక అది సింక్‌ కావాల్సిందే అని మస్క్‌ తన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ను 44 బిలియన్ల డాలర్లకు మస్క్‌ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ డీల్‌ కుదుర్చుకునేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లారు.

ట్విట్టర్‌ను తొలుతు కొనుగోలు చేస్తానని మస్క్‌ ప్రటించారు. ఆ తర్వాత డీల్‌కు బ్రేక్‌ వేస్తున్నట్లు చెప్పారు. దీంతో ట్విట్టర్‌, మస్క్‌ మధ్య మాటల యుద్ధం నడించింది. ఫేక్‌ అకౌంట్లు చూపుతూ ట్విట్టర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు మస్క్‌ ఆరోపించారు. అయితే డీల్‌ నుంచి బయటపడేందుకు మస్క్‌ ఆ ఆరోపణలు చేసినట్లు ట్విట్టర్‌ పేర్కొన్నది.

ఇటీవల మస్క్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒరిజినల్‌ ప్రైజ్‌కే ట్విట్టర్‌తో డీల్‌ను కొనసాగించనున్నట్లు మస్క్‌ తెలిపారు. దీంతో ఈ కేసును అక్టోబర్ 28వ తేదీ వరకు వాయిదా వేశారు. ఒకవేళ రేపటి లోగా ట్విట్టర్‌, మస్క్‌ మధ్య ఒప్పందం కుదరకుంటే, అప్పుడు ఈ కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అవుతుంది.